Home

బాలల నేస్తం

బాల విజ్ఞాన వికాస - నేస్తం

బాలరంజని

బాల విజ్ఞాన వికాస - నేస్తం బాలరంజని
బుడిబుడి అడుగులు బుడతలు
కులమత మెరుగని గువ్వలు
అక్షర విలువల గురజాడ పిడుగులు
గురజాడ - గిడుగులు అడుగులు
మిరే మిరే...బాలలు
రేపటి బావి బారత ఉత్తమ పౌరులు

మీ ఊహలకు అక్షరరూపం ఎలా ఇవ్వాలో? మీ కలాలను ఎలా కదిలించాలో? మీలో దాగి వున్న సాహిత్య, సంగీత, సాంస్కృతిక, కళా రూపాలను ఎలా వెలికితీయాలో??? సరైన 'వేదిక' లేదని వేదన చెందాల్సిన అవసరం లేదు. మీ మదిలో మెదిలే ఆలోచనలు ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం లేదు. మీ అక్షర రూపాలకు ఆసరాగా మీ కళారూపాలకు బాసటగా మీ క్రీడా నైపుణ్యాలకు కంచెగా వుంటూ వివిధ కళా రంగాల్లో ఉన్న మీ ప్రతిభను బాహ్య ప్రపంచానికి ఎలా చాటి చెప్పాలో ఆ బృహత్తర బాధ్యతకు మా బాలరంజని వేదిక కానుంది.

బాల సాహిత్యానికి ప్రాథమిక స్థాయి నుంచే మీలో పునాది వేసి సత్ప్రవర్తనకు దాటవేస్తూ మీ సద్గుణాలను అందిస్తూ మీ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు మన బాలరంజని ఆవిర్భవించిందని అని అనటం అతిశయోక్తి కాదు

కొందరు బాలల్లో సాహిత్యంతోపాటు చిత్రలేఖనం, గానం, మ్యాజిక్, చదరంగం, నృత్యం, క్రీడలు వివిధ కళా రంగాల్లో ఆసక్తి ఉన్న ఇంగ్లీషు చదువుల కోవర్టుల ఒత్తిడి భూతానికి బలై మనశ్శాంతి లేక మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో తల్లిదండ్రుల ఆదరణ లేక టీవీలకు, సెల్ఫోన్లకు, నెట్లకు, వ్యసనాలకు బానిసలవుతున్నారు అన్నది అక్షర సత్యం. నివేదనలను తీర్చడానికి 'మేమున్నాము' భయంలేదు సందేహం లేదు రాబోవుకాలంలో మీకు సామాజిక రచన కలిగించి సాంస్కృతిక కళా రంగాల్లో ఉన్నత స్థితికి 'బంగారు బాట' వేసే బాధ్యత మాది.

ఈ బాల సాహితీ సాంస్కృతిక కళా వికాసానికి మీ వంతు కృషిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సాహితీవేత్తలు పాఠకులు విద్య రంగాలు మాకు తోడ్పడుతూ మీ సహకారాలు అందించి మన సభ్యులుగా చేరి.. తెలుగు బాషా వికాసంతోపాటు బాల సాహిత్య వికాసానికి చేయూత అందిస్తారని ఆశిస్తున్నాము. మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఆహ్వానిస్తున్నాం.